AP: రాష్ట్రంలో MSME రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రేపు విజయవాడలో ‘MSME గ్రోత్ సమ్మిట్ 2026’ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు ఈ సదస్సుకు హాజరై, రాష్ట్రవ్యాప్తంగా 38 MSME పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొనే ఈ సదస్సులో MSMEల బలోపేతంపై చర్చించనున్నారు.