మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. మహాయుతి కూటమి 230కి పైగా స్థానాల్లో అఖండ విజయం సాధించడంతో ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు. ఈ ఘోర పరాజయానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. శివాజీ, అంబేద్కర్ భావజాలానికి తామే నిజమైన ప్రతినిధులమని, తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.