ఈసీజీ పరీక్షను ఇకపై సులువుగా చేసుకోవచ్చు. అగ్గిపెట్టె సైజులో ఉండే ‘స్పందన్’ అనే మొబైల్ యాప్‌తో ఈ పరికరం పనిచేస్తుంది. మామూలు ఈసీజీలకి ఉన్నట్టే ఈ పరికరంలోనూ శరీరానికి అంటించే ‘లీడ్స్’ ఉంటాయి. వాటిని పెట్టుకుని కూర్చుంటే చాలు. రెండు నిమిషాల్లో మన ఈసీజీ రిపోర్టు PDFగా యాప్‌లోకి డౌన్లోడ్ అయిపోతుంది. దీనికి కరెంట్, బ్యాటరీ కూడా అవసరం లేదు. ఫోన్ పవర్ సరిపోతుంది.