TG: హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను శనివారం దుండగులు కారుతో ఢీ కొట్టి హతమార్చిన సంగతి తెలిసిందే. అనంతరం న్యాయవాది చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు నిందితుల ఫోటోలను సైతం విడుదల చేశారు. వారి కోసం పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.