AP: అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. చిన్నమండెం మం.దేవగుడిపల్లిలో ప్రభుత్వ పక్కాగృహాల్లో గృహప్రవేశాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ప్రజావేదికలో పక్కాగృహాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ మేరకు వర్చువల్గా ప్రారంభించనున్నారు.