కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. CM సిద్ధరామయ్య, Dy CM డీకే శివకుమార్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఈరోజు డీకే నివాసంలో ఇద్దరూ కలిసి ‘బ్రేక్ ఫాస్ట్’ చేయనున్నారు. మొన్నే ఒకే వేదికపై కనిపించి ఆశ్చర్యపరిచిన ఈ ఇద్దరు.. ఇప్పుడు మళ్లీ కలుస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. CM మార్పుపై రచ్చ జరుగుతున్న వేళ.. ఈ భేటీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది.