TG: పదవులు పొందినవారు నిజాయితీగా పని చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని వదులుకోమని స్పష్టం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ తన కుటుంబం బాగు కోసమే పని చేశారని విమర్శించారు. జూన్ 2న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు.