ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, హర్యానాతో పాటు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ఖాతా ఖాళీ అయిందని ప్రధాని మోదీ వెల్లడించారు. కాంగ్రెస్ పరాన్న జీవిలా మారిపోయిందన్నారు. వీర సావర్కర్‌ను అవమానించిందని తెలిపారు. పక్క రాష్ట్రాల సీఎంలను తీసుకొచ్చి ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని, అందుకు ప్రజలు ఆ పార్టీకి ఓటు వేయలేదన్నారు.