బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సెంచరీ మార్కును దాటి దూసుకుపోతోంది. తాజా సమాచారం ప్రకారం, ఎన్డీయే కూటమి 102 స్థానాల్లో విజయం సాధించి, మరో 101 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కూటమి 12 స్థానాల్లో గెలిచి, మరో 22 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమి ఘన విజయంతో మరోసారి అధికారం చేపట్టే దిశగా పయనిస్తోంది.