AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ్టి నుంచి రాజమండ్రిలో పర్యటించనున్నారు. రాత్రికి రాజమండ్రిలో బస చేయనున్న ఆయన, రేపు ఉదయం నుంచి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పవన్ పరిశీలించనున్నారు. అధికారులు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు.