తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి సీఎం అయిన జోసెఫ్ విజయ్.. ఇప్పుడు కర్ణాటక రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన పార్టీ ‘TVK’ను కర్ణాటకలోనూ విస్తరించాలని వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. త్వరలో జరగబోయే బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (BBMP) ఎన్నికల్లో పోటీ చేసి, కర్ణాటకలోనూ పార్టీ జెండా పాతాలని విజయ్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.