AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్యం, సుగంధ్ను నెల్లూరు జిల్లా జైలు నుంచి తిరుపతికి తరలించారు. అనంతరం వారికి తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షల్లో టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రమణ్యంకు అధిక రక్తపోటు ఉన్నట్లు వెల్లడైంది.