విమానాల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఇబ్బందులకు కారణమైన ఇండిగోపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఆ సంస్థకు ఉన్న షెడ్యూల్ స్లాట్లలో 5% కోత విధించింది. దీంతో ఆ సంస్థ నడిపే సర్వీసుల సంఖ్య కనీసం 110 వరకు తగ్గనుంది. ఇండిగోకు తగ్గించిన స్లాట్లను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించనున్నట్లు DGCA ఓ ప్రకటన విడుదల చేసింది.