మహిళల వివాహంపై జపాన్ నేత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 25 ఏళ్ల తర్వాత మహిళల పెళ్లిపై నిషేధం విధించాలని కన్జర్వేటివ్ పార్టీ వ్యవస్థాపకుడు నవోకి హయాకుట పేర్కొన్నారు. 30 ఏళ్లు రాగానే వారి గర్భాశయాన్ని తొలగించాలని సూచించారు. జనాభా సంక్షోభానికి పరిష్కార మార్గాలు ఇవేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు.