మినుములను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి దోహదపడుతాయి. మధుమేహంతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.