AP: రాష్ట్ర ప్రభుత్వం బీచ్ శాండ్ ప్రాజెక్టులను ప్రోత్సహించనుంది. ఈ మేరకు కోస్తా జిల్లాల పరిధిలో బీచ్ శాండ్ మినర్స్ తవ్వి, శుద్ధి చేసి, వాటినుంచి అరుదైన ఖనిజాలను తయారు చేసే సంస్థలను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. దీనికోసం విశాఖ పరిధిలోని అరుదైన ఖనిజాల క్లస్టర్ ఏర్పాటు చేయాని చూస్తోంది. విజన్-2047 నాటికి ఎంతమేరకు ఖనిజాలు ఉత్పత్తి చేయాలనేదానిపై రోడ్ మ్యాప్ రూపొందిస్తోంది.