యూపీ ఝింఝానా ప్రాంతంలో సినీఫక్కీలో జరిగిన ఎన్కౌంటర్లో బవేరియా గ్యాంగ్ లీడర్ మిథున్ హతమయ్యాడు. 20 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అతడిపై రూ.1.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. అతని గ్యాంగ్ సభ్యులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై వారంతా కాల్పులు జరిపారు. దీంతో అధికారులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో అక్కడే ఉన్న మిథున్ ప్రాణాలు కోల్పోయాడు.