TG: ప్రజాసమస్యలు గుర్తించి ప్రభుత్వంతో పరిష్కారం చేయించడమే జాగృతి లక్ష్యమని కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఆమె.. ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడం విచారకరమన్నారు. జిల్లాలో పెద్ద పెద్ద నాయకులున్నా.. అభివృద్ధిలో వెనకబడిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష నాయకులు జాగృతిని విమర్శిస్తున్నారని అన్నారు.