ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముజమ్మిల్ విచారణలో అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఎర్రకోటలో ముజమ్మిల్, డాక్టర్ ఉమర్ రెక్కీ నిర్వహించినట్లు తెలిపారు. జనవరి 26న ఎర్రకోట లక్ష్యంగా దాడి జరపాలని ప్లాన్ చేసినట్లు చెప్పారు. దీపావళి రోజున రద్దీగా ఉండే ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు.