TG: సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను ఏదైనా ప్రాజెక్టును అడ్డుకున్నట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. సీఎంగా ఉన్న వ్యక్తి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెలంగాణకి సీఎం కావడం రాష్ట్ర ప్రజల దురదృష్టమన్నారు. అయితే HYD మెట్రో రెండో దశ ప్రాజెక్టును కిషన్ రెడ్డి అడ్డుకున్నారని రేవంత్ అన్నారు.