చెన్నై మెట్రో రైలు సబ్వేలో చిక్కుకుపోయింది. విమ్కో నగర్ డిపో నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్లే మెట్రో ట్రైన్ మధ్యలో ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు మధ్యలోనే దిగి రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లారు. సాంకేతిక లోపం, విద్యుత్ సరఫరాలో సమస్యల వల్ల ఈ అసౌకర్యం తలెత్తినట్లు అధికారులు వెల్లడించారు.