AP: వైఎస్ జగన్పై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై జగన్ అండ్ కో అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. చివరకు స్వచ్ఛభారత్ నిధులను కూడా వినియోగించలేదని ఆగ్రహించారు. మంత్రి లోకేష్ పారదర్శకంగా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి.. పోస్టులు కేటాయించారని స్పష్టం చేశారు.