AP: కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ను మంత్రి లోకేష్ కలిశారు. ఏపీలో మొంథా తుఫాన్ కారణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు నష్టం వాటిలినట్లు కేంద్రమంత్రికి లోకేష్ వివరించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1302 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.