TG: మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారతను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రేపటి నుంచి ప్రతిష్టాత్మకంగా “మహిళా వారోత్సవాలు” నిర్వహించనుంది. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ వేడుకలు జరుగనున్నాయి. మే 25వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో ఈ కార్యక్రమాలు మొదలు కానున్నాయి.