AP: మంత్రి లోకేష్ నిన్న రాత్రి డల్లాస్ చేరుకున్నారు. ఆయనకు ప్రవాసాంధ్రులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. డల్లాస్లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ ప్రసంగించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా, కెనడాల్లో ఈనెల 10వ తేదీ వరకు ఆయన పర్యటించనున్నారు.