TG: విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలను వివరించేందుకు ఓ ప్రిన్సిపాల్ చేసిన పని చర్చనీయాంశమైంది. భద్రాద్రి(D) కిన్నెరసాని డ్యామ్సైడ్లోని గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్.. సీత్లా పండగను వివరిస్తూ కోడిని కోశాడు. దీనిపై విమర్శలు రావడంతో.. ‘గిరిజన పండగల్లో మేకలు కోస్తారు కానీ అంత పెద్ద జంతువును కోయలేక కోడిని కోశా’ అనడం కొసమెరుపు.