TG: పదేళ్ల BRS పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద BJP ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో నెరవేర్చని హామీలను పేర్కొంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప మరేవీ అమలు కాలేదని మండిపడ్డారు.