TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎల్లుండి సాయంత్రం ప్రచార గడువు ముగియనుంది. దీంతో కులాల వారీగా, యువత, గుంపుల వారీగా సమావేశాలు పెట్టి మరీ అభ్యర్థిస్తున్నారు. దూరప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించేందుకు అభ్యర్థులు మాట్లాడుతున్నారు. చార్జీలకు డబ్బులు పంపుతున్నారు. 11న తప్పనిసరిగా వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు.