TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఇవాళ రెండో రోజు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. హెటిరో ఫార్ములేషన్స్ రూ. 1800 కోట్లు, భారత్ బయోటెక్ సీఆర్డీఎంవో రూ. 1000 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 2000 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా రూ. 1200 కోట్లు, బయోలాజికల్ వ్యాక్సిన్ ప్రాజెక్టు రూ. 4 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి.