AP: హైదరాబాద్లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT)లో వైఎస్ జగన్ పిటిషన్పై విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేసేందుకు జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ కేసుపై తదుపరి విచారణ డిసెంబర్ 13కి వాయిదా పడింది. కాగా, సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదిలీకి సంబంధించి NCLTలో జగన్ పిటిషన్ వేశారు. తనకు తెలియకుండా తల్లి, చెల్లి అక్రమంగా షేర్లు బదిలీ చేసుకున్నారని ఆరోపించిన విషయం తెలిసిందే.