AP: రాష్ట్రంలో కిలో అరటిపండ్లు రూ.50 పైసలకే అమ్ముడవుతున్నాయంటూ మాజీ సీఎం జగన్ చేసిన ట్వీట్‌పై కూటమి ప్రభుత్వం స్పందించింది. ఈ వాదన పూర్తిగా అసత్యమని తెలిపింది. నవంబరు నాలుగో వారంలో టన్ను అరటి ఏ గ్రేడ్‌కు రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెరిగిందని చెప్పింది. బీ గ్రేడ్ ధర రూ.6 వేల నుంచి రూ.8 వేలకు, సీ గ్రేడ్ ధర రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు అమ్ముడయ్యాయని పేర్కొంది.