TG: పంట కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొక్కజొన్న కొనుగోళ్ల కోసం అదనంగా.. మరో రూ. 1800కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొక్కజొన్న భారీ దిగుబడుల దృష్ట్యా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ. 1100 కోట్లతో జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.