AP: టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత మహేష్ యాదవ్ ఫిర్యాదు చేశారు. అలిపిరి రోడ్డులో దుకాణాల తొలగింపు వ్యవహారంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు, కూటమి ప్రభుత్వంపై భూమన కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని మహేష్ యాదవ్ హెచ్చరించారు.