TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయి. ఇవాళ రెండోరోజు రూ.1,04,350 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి. గోద్రెజ్ రూ. 150 కోట్లు, ఫెర్టిస్ ఇండియా రూ. 2వేల కోట్లు, KAJS ఇండియా రూ. 650 కోట్లు, ఎఫ్డీసీ ప్లాంట్ వింటేజ్ కాఫీ రూ. 1100 కోట్లు, రిలయన్స్ కన్స్యూమర్ రూ. 1500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు MOUలు చేసుకున్నాయి.