TG: హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ’ (HILTP) ఆన్లైన్ పోర్టల్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. నగర కోర్ అర్బన్ ప్రాంతంలో ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను సులభంగా, పారదర్శక పద్ధతిలో ఇతర ప్రాంతాలకు తరలించడమే ఈ నూతన విధానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.