చలికాలంలో అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఈ ప్రయోజనాల కోసం అల్లం టీ, సూప్, కషాయం తీసుకోవచ్చు. ఫలితంగా రోగనిరోధక శక్తి మెరుగుపడి సీజనల్ సమస్యల వ్యాప్తిని నిరోధిస్తుంది. అలాగే స్ట్రోక్ సమస్యల ప్రమాదం తగ్గుతుంది.