AP: పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ కేసులో రవి కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ AVSO సతీష్ మృతిచెందాడు. తాడిపత్రిలోని రైల్వే ట్రాక్‌పై అతడి మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. గతంలో హుండీ లెక్కింపు సమయంలో రవి కుమార్ చోరీ చేసినట్లు సతీష్ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అతడి మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.