AP: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతుందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. పెంచలయ్య హత్య వెనుక గంజాయి ముఠా పాత్ర ఉందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 550 రోజులు దాటినా డ్రగ్స్ నిర్మాలనపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. టీడీపీ నేత కామాక్షి ఇంట్లో 25 కేజీల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు. రౌడీ మూకలను స్థానిక ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.