AP: ఐటీ భవిష్యత్ అవకాశాలను చంద్రబాబు అందిపుచ్చుకున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డ్రోన్లు, స్పేస్, క్వాంటం, AIలోనూ CM ముందంజలో ఉన్నారని తెలిపారు. దేశంలో తొలిసారి డ్రోన్, స్పేస్ సిటీల ఘనత చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. డ్రోన్ సిటీ ఏర్పాటుతో 40 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు దక్కుతాయని వెల్లడించారు.