పాతికేళ్లు దాటిన యువతకు సమాజం నుంచి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అందులో ‘పెళ్లెప్పుడు చేసుకుంటావ్?’ ఇలా పదేపదే అడగడం వల్ల వారు మానసికంగా ఒత్తిడికి లోనవుతారని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. నిద్రలేమి, ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి వాటికి గురవుతారని, తమలో ఏదో లోపం ఉందని భావిస్తారు. ఫలితంగా జనాలకు దూరంగా ఉంటారని, డిప్రెషన్లోకి వెళ్లి సూసైడ్ ఆలోచనలు వస్తాయంటున్నారు.