AP: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు జరగనుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీలు నిర్వహించనున్నారు. అయితే, కాకినాడ జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందని ఎస్పీ ప్రకటించారు. నిరసన కార్యక్రమాలు చేయాలంటే పోలీసుల అనుమతులు తప్పనిసరని ప్రకటించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని భావిస్తే అనుమతులపై ఆంక్షలు విధించి, కేసులు పెట్టే అవకాశం ఉందన్నారు.