అల్లం, బెల్లం మిశ్రమాన్ని రోజూ తింటే గొంతు, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో ఉండే కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే, గొంతు సమస్యలు సైతం తగ్గిపోతాయి. గొంతులో నొప్పి, మంట నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ రెండింటి మిశ్రమం శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. చల్లని వాతావరణం, చలికాలంలో ఈ మిశ్రమాన్ని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది.