AP: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో విలేకరి నారాయణను దారుణంగా హత్య చేశారని టీడీపీ నేత బీటెక్ రవి ఆరోపించారు. ప్రజాదరణ కలిగిన నాయకులను బతకనిచ్చేవారు కాదన్నారు. తమకు తెలిసిన జగన్.. ప్రజలకు తెలిసిన జగన్ ఏంటో తెలియాలన్నారు. వాళ్ల జోలికి వస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారని గుర్తుచేశారు. నమ్మి వాటా ఇచ్చిన వెంకటనరసయ్యను దారుణంగా హత్య చేసిన చరిత్ర వారిదన్నారు.