AP: విద్యుత్ శాఖపై సమీక్షలో గత ప్రభుత్వ విధానాలపై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. అసమర్థ నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని గత పాలకులు అస్తవ్యస్థం చేశారని అన్నారు. పీపీఏ రద్దుతో రూ.9 వేల కోట్ల భారాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రజలపై మోపిందని మండిపడ్డారు. విద్యుత్ వినియోగించకుండానే ప్రజాధనాన్ని కంపెనీలకు చెల్లించిందని చెప్పారు.