AP: టీడీపీ దివంగతనేత కింజరాపు ఎర్రనాయుడు వర్థంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధితో పాటు బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు చివరిశ్వాస వరకు కృషి చేశారు. రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. వారి సేవలను స్మరించుకుందాం’ అని ట్వీట్లో పేర్కొన్నారు.