TG: తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఈ నెల 11న జరగనుండగా.. ప్రచారం గడువు ఈ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. అలాగే ఇవాళ్టి నుంచి 11 వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఇక తొలి విడతకు సంబంధించిన 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 3836 పంచాయతీలకు గురువారం ఉ.7 గంటల నుంచి మ.1గం వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.