AP: రాష్ట్రంలో ఎండలు, వడగాలులు తీవ్రరూపం దాల్చాయి. 17 జిల్లాల్లోని 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. తూ.గో.జిల్లా చిట్యాలలో అత్యధికంగా 48.3 డిగ్రీలు, పిడుగురాళ్లలో 48.14 డిగ్రీలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.