TG: రాష్ట్రంలో ఎండలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 51మంది వడదెబ్బకు గురై మరణించారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23మంది మృతి చెందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 11, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్లో ఐదుగురు, నల్గొండలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు సరస్వతి అంత్య పుష్కరాలకు వచ్చి వడదెబ్బకు గురై మరణించారు.