TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు తొలిరౌండ్ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి 8,911 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్కు 8,864 ఓట్లు, బీజేపీకి 2,167 ఓట్లు నమోదైనట్లు వెల్లడించారు. తొలి రౌండ్లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉంది. తొలుత షేక్‌పేట డివిజన్ ఈవీఎం ఓట్లను లెక్కించారు.