TG: ప్రధాని మోదీ బీసీ కాదు.. లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్లు.. మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని ఆరోపించారు. మోదీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదని, అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పారు.